ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు..!
ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని..టీడీపీ వర్గీయుల ఓట్లు తొలగించారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఐతే.. ఓటర్ల జాబితా సరిచేయాలని హైకోర్టు ఆదేశించింది.;
ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని..టీడీపీ వర్గీయుల ఓట్లు తొలగించారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఐతే.. ఓటర్ల జాబితా సరిచేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా ఎస్‌ఈసీ ఎన్నికలకు వెళ్లడంతో... పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితా సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు తాజాగా ఆదేశించింది.