స్వాతంత్ర దినోత్సవం కూడా అధికార పార్టీ రాజకీయాలు మానలేదు.హిందూపురంలో అధికార పార్టీ నేతల తీరు మారలేదు. జాతీయ జెండా ఆవిష్కరణలోనూ గ్రూప్ పాలిటిక్స్ చేశారన్న విమర్శలు స్వంత పార్టీ నుంచే వస్తున్నాయి. హిందూపూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని వైసీపీ పార్టీ నేతలే అంటున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు ఉదయాన్నే మున్నిపల్ ఆఫీస్‌కు చేరుకున్నారు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ. అయితే కార్యాక్రమానికి హాజరుకావాల్సిన మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఫోన్టు స్విచ్చాఫ్ చేసుకొని అందుబాటులో లేకపోవడంతో ఆమె జెండా ఎగురవేయకుండానే వెనుతిరిగివెళ్లి పోయారు. ఆ తరువాత హిందూపురం నియోజక వర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపికతో జెండా ఆవిష్కరణ చేపట్టారు. అధికార కార్యక్రమంలో పార్టీ నేత పాల్గొనడంపై స్వంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.