AP DSC: ఏపీ నిరుద్యోగులకు ఉగాది బొనంజా

డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముహూర్తం ఖరారు... ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల !... మొత్తం 3,600 పోస్టుల భర్తీకి సన్నాహాలు

Update: 2026-02-19 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పినట్లుగానే.. ఈ ఏడాది మరో డీఎస్సీకి రంగం సిద్ధం చేసింది. ఉగాది పండగ సందర్భంగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం కొత్త డీఎస్సీ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు..? సిలబస్‌లో మార్పులున్నాయా? కాంట్రాక్ట్ టీచర్లకు వెయిటేజ్ ఇస్తారా? వయోపరిమితి ఎంత ఉండొచ్చు? పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు..? వంటి సమగ్ర వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదలకుండా పూర్తి వివరాలు చెప్తాం... కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ అభ్యర్థులకు... రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. రాష్ట్రంలో మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఉగాది పండుగ కానుకగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ లో వివిధ విభాగాల్లో మొత్తం 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా లెక్క తేలింది. ఆదర్శ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ పోస్టులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలు, సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఉండటంతో ప్రభుత్వం మరో డీఎస్సీ వేసేందు సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలను సేకరించింది. మొత్తం 3,600 వరకు పోస్టులు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల వివరాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్స్, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్ల నుంచి అధికారులు సమాచారం తీసుకున్నారు. వీటిలో కూడా కలిపి 1200 ఖాళీలు ఉన్నట్లు నిర్థారించారు. వీటితో పాటుగా మున్సిపల్, పంచాయతీరాజ్, ప్రభుత్వ పాఠశాలల్లో 1,700 పోస్టులు ఉన్నాయని ప్రాథమికంగా నిర్థారించారు. వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 700 వరకు భర్తీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇవన్నీ కలిపి 3,600 వరకు పోస్టుల్ని భర్తీ చేయనున్నారని సమాచారం. గతేడాది ఏప్రిల్‌ నెలలో మొత్తం 16,347 పోస్టులకు డీఎస్సీ ప్రకటించగా.. వీటిలో 15,941 భర్తీ చేశారు, కొన్ని పోస్టులకు రిజర్వేషన్ల అభ్యర్థులు లేకపోవడంతో నిలిచిపోయాయి.

 సిలబస్‌లో మార్పులు లేవ్

ఈసారి డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన సిలబస్‌నే ఈ నోటిఫికేషన్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు పాత మెటీరియల్‌తోనే తమ ప్రిపరేషన్‌ను కొనసాగించవచ్చు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ను అందుబాటులో ఉంచారు. అయితే ప్రభుత్వం కొత్త డీఎస్సీలోని అన్ని పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్‌ ప్రావీణ్యం పరీక్ష నిర్వహించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తగినతం సమయం లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. గత డీఎస్సీ తరహాలోనే గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చే చాన్స్ ఉంది. జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, రిజర్వేషన్ అభ్యర్థులకు SC/ST/BC/EWS అభ్యర్థులకు 49 ఏళ్ల వరకు అవకాశం ఉండవచ్చు. ఈ నియామకాల్లో కూడా ‘టెట్’ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. మిగిలిన 80 శాతం మార్కులు డీఎస్సీ పరీక్ష ఆధారంగా ఉంటాయి. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు.

జిల్లాల వారీగా రోస్టర్లు...

ప్రస్తుతం జిల్లాల వారీగా రిజర్వేషన్ల ప్రకారం రోస్టర్ పాయింట్లను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ పూర్తవ్వగానే ఆర్థిక శాఖ అనుమతికి పంపిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పరీక్షకు కేవలం 45 నుండి 60 రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూడకుండా ఇప్పటి నుండే తమ ప్రిపరేషన్‌ను వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 2,600 వరకు ఉన్నారు. వీరంతా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రత్యేక అవసరాలున్న పిల్లలు చదువుతున్న స్కూల్స్‌లో పనిచేస్తున్నారు. అయితే వీరిలో సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్‌ అమలు చేయనున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అన్ని అర్హతలూ ఉన్నవారికి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి పదేళ్ల సర్వీసుతో పాటుగా టెట్‌ వంటివి అర్హతలుగా నిర్ణయించారట అధికారులు. ఈ అర్హతలు ఉన్నవారికి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ వీరిలో ఎవరికైనా పర్మినెంట్‌ ఉద్యోగం కావాలంటే.. వీరు కూడా డీఎస్సీ రాయాల్సిందే.

Tags:    

Similar News