Mahapadayatra : గుడివాడలో హైటెన్షన్..
Mahapadayatra : గుడివాడలో హైటెన్షన్..
Mahapadayatra : కృష్ణా జిల్లా గుడివాడలో హైటెన్షన్ నెలకొంది.అమరావతి మహాపాదయాత్ర గుడివాడ శరత్ టాకీస్ వద్ద చేరుకోగానే అమరావతి నినాదాలు మిన్నంటాయి. దీనికి పోటీగా శరత్ టాకీస్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరస్పరం నినాదాలతో శరత్ టాకీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. భారీగా మోహరించిన పోలీసులు.. రైతులు, వైసీపీ కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
మరోవైపు... మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సినీఫక్కిలో గుడివాడ చేరుకున్నారు. ఉదయం నుంచి చింతమనేనిపై పోలీసుల డేగకళ్ల నుంచి తప్పించుకుని గుడివాడ చేరుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి బైక్‌పై గుడివాడ పయనమయ్యారు. బైక్‌పై గుడివాడ వెళుతున్న చింతమనేనిని గమనించారు. అయితే...పోలీసులకు చిక్కకుండా పాదయాత్ర ప్రాంతానికి చేరుకున్నారు చింతమనేని ప్రభాకర్.