MLA Roja: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక సమస్య.. ల్యాండింగ్‌లో..
MLA Roja: రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా బెంగళూరులో ల్యాండ్ అయింది.;
MLA Roja (tv5news.in)
MLA Roja: రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న విమానం సాంకేతిక సమస్య కారణంగా బెంగళూరులో ల్యాండ్ అయింది. ఈ విమానంలో టీడీపీ సీనియర్ నేత యనమల, టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సాధ్యంకాకపోవడంతో ఇండిగో విమానం గంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
ఆ తరువాత విమానాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. అయితే, విమానం బెంగళూరు వచ్చినందుకు గాను ఛార్జీలు చెల్లించాలంటూ ఇండిగో సిబ్బంది ప్రయాణికులను డిమాండ్ చేశారు. దీంతో విమానంలో సమస్య వచ్చి బెంగళూరు తీసుకొచ్చింది మీరని, దానికి తామెందుకు డబ్బులు కట్టాలని ప్రయాణికులు నిలదీశారు. చివరికి బెంగళూరు నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో స్పష్టత లేదని యనమల తెలిపారు.