జగన్ సభలకు వచ్చేది జనం కాదు.. సైకో బ్యాచ్ - మాజీ మంత్రి గతంలో చంద్రబాబును అడ్డుకున్నప్పుడు సీఎం జగన్‌కు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రశ్నించారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని ఇంటి నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళ్లు కట్టి అడ్డుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. లోకేశ్ యువగళం పాదయాత్రపై ఆంక్షలు పెట్టినప్పుడు ఏమైందని అడిగారు. ఇప్పుడు పోలీసులపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే జాగ్రత్త అని జగన్ హెచ్చరించడం సిగ్గుచేటన్నారు. జగన్ సభలకు వచ్చే వారంతా జనం కాదు..సైకోబ్యాచ్ అని ఆనంద్ బాబు ఆరోపించారు. రప్పా రప్పా నరికేస్తే తప్పేంటని సిగ్గులేకుండా మాట్లాడుతున్న జగన్ సమాజానికి ఏం చెబుతున్నారు? అని మండిపడ్డారు. ‘‘జగన్ తన పాలనలో ప్రతిపక్షాలను వేధించేందుకు, పరదాలు కట్టేందుకే పోలీసుల్ని ఉపయోగించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు నిజాయతీగా పనిచేస్తున్న పోలీసు వ్యవస్థపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.