రాంబాబును పొగడాలంటున్న జగన్.. కూటమి ఫైర్..

Update: 2026-02-05 10:45 GMT

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకూ మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు ఎలాంటి అరాచకాలు చేసినా సరే అసలు తప్పే కాదన్నట్టు ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఎన్ని స్కాములు చేసినా, ఎన్ని బూతులు మాట్లాడినా సరే వాళ్ళని పొగడాలి తప్ప శిక్షించకూడదు అన్నట్టు జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగానే ఉంది. నిన్న మరోసారి ఆయన తన విజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడును బూతులు తిడితే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్లిన జగన్ పెద్ద బిల్డప్ ఇవ్వడం కోసం వేలమందిని డబ్బులు పెట్టి రప్పించుకున్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటిముందు మాట్లాడుతూ.. ఒక దారుణమైన మాటలు చెప్పేశారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని.. అతను చేసిన పనికి వీలైతే పొగడాలి తప్ప ఎలా అరెస్టు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్.

జగన్ మాటలు విన్నవారంట ఒకంత షాక్ కు గురవుతున్నారు. ఎందుకంటే నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడును ఇలా బూతులు తిడితే తప్పు కాదని జగన్ ఎలా అంటారు. ఆయన కూడా ఒకసారి సీఎం గా పని చేశారు కదా. బూతులు తిడితే తప్పు అనే విషయం జగన్ కు తెలియదా. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యకర్తలు ఒక చిన్న పోస్ట్ పెట్టిన సరే దాడులు చేయించిన చరిత్ర జగన్ కు ఉంది. ఒక చిన్న పోస్ట్ పెడితేనే భరించలేని జగన్.. చంద్రబాబు నాయుడును మాత్రం బూతులు తిట్టాలి అని వైసిపి నేతలను ఎంకరేజ్ చేయటం ఎంత దారుణం.

నిండు అసెంబ్లీలో మహిళలను అవమానించిన చరిత్ర జగన్ కు ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ను అసెంబ్లీలో అత్యంత దారుణమైన మాటలు అన్నవారికి వైసీపీలో కీలక పదవులు ఇచ్చింది జగనే కదా. సీఎం చంద్రబాబు నాయుడు ను ఎంతమంది తిడితే అంత పైశాచిక ఆనందం పొందటం జగన్ కు అలవాటు. అందులో భాగంగానే అంబటి రాంబాబు పుట్టినందుకు జగన్ పొగడాలి అంటున్నారా అని కూటమినేతను ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News