జగన్ దృష్టిలో వైసీపీ నేతలు ఎంత పెద్ద కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి చేసినా సరే అవి చాలా చిన్నగానే కనిపిస్తాయి కాబోలు. దీనికి ఆయన మాట్లాడుతున్న మాటలే నిదర్శనం. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి కేసు దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయిన సంగతి తెలిసిందే. 100 కోట్ల మంది నమ్మే మహా ప్రసాదమైన తిరుమల లడ్డూను కల్తీ చేసిన పాపం వైసిపి నేతలది. స్వయంగా వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేసి మరీ ఏర్పాటు చేయించుకున్న సిబిఐ అధికారులే లడ్డును కల్తీ చేశారని తేల్చి చెప్పారు. దీనిపై హిందూ భక్తులు మొత్తం భగ్గుమంటున్నారు. పవిత్రమైన లడ్డూను కల్తీ చేస్తారా అంటూ ఏకి పారేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. కానీ జగన్ కు ఇవేమీ కనిపించవు. ఆయన దృష్టిలో అవన్నీ చాలా చిన్న కేసులు.
నిన్న మూడు గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించిన జగన్ ఏం మాట్లాడాడో మనం చూసాం. అదేదో చిన్న పరకామణి కేసు, అదేదో చిన్న లడ్డు కేసు.. దాన్ని కూటమి కావాలని హైలెట్ చేస్తుందని అంటున్నాడు జగన్. సీఎం చంద్రబాబు నాయుడు తన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటి కేసులను తీసుకొచ్చి ప్రజలను మభ్యపెడుతున్నాడు అంటూ జగన్ చెప్పడం నిజంగా విడ్డూరం అనే చెప్పాలి. ఎందుకంటే కోట్ల మంది నమ్మకానికి, ఆరోగ్యానికి సంబంధించిన అంత పెద్ద కేసులను జగన్ చిన్న కేసులనటం అంటే నిజంగా విడ్డూరమే కదా. దీనిపై నారా లోకేష్ ఒక ట్వీట్ చేసిన సంగతి మనం చూసాం.
లక్ష కోట్లు దోచుకున్న జగన్ కు పరకామణి, కల్తీ నెయ్యి కేసులు చాలా చిన్నగానే కనిపిస్తాయి లే అంటూ సెటైర్ వేశారు. మరి నిజమే కదా. పరకామణి కేసులో 9 డాలర్లు మాత్రమే దోచుకున్నారు మహా అయితే 70 వేలకు పైగా అవుతాయి దానికి మేము కోట్ల ఆస్తులు టీటీడీకి రాయించాం కాబట్టి మేము చేసింది చాలా గొప్ప పని మమ్మల్ని అభినందించాల్సింది పోయి ఇలా తిడతారా అంటూ జగన్ చెప్పటం ఆయన విజ్ఞతకే వదిలేయాలి. అంటే పరకామణిలో దోచుకోవడం జగన్ దృష్టిలో తప్పు కాదన్నమాట. ఒకవేళ జగన్ లాగా లక్ష కోట్లు దోచుకుంటేనే అది తప్పు అవుతుందేమో అంటున్నారు కూటమినేతలు. కూటమి ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా దాన్ని పెద్దది చేసి చూపించే జగన్ కు.. వైసీపీ నేతల అతిపెద్ద అక్రమాలు చాలా చిన్నగానే కనిపించడం ఏంటో మరి.