JAGAN: జగన్... ప్రతిపక్ష హోదా ఏమైనా చాక్లెటా..?
ఆర్టికల్ 188 చదువుకో: యనమల
ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అని అనాలని అందరికీ కల ఉంటుందని అనిత అన్నారు. కానీ జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని వంగలపూడి అనిత తెలిపారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హోదా చాక్లెటో.. బిస్కెటో కాదని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రశ్న హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వరుసగా 60 రోజులు సభకు రాని ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయొచ్చని చెప్పారు. అంతేకాక, తదుపరి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో కోర్టు నిర్ణయం మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని యనమల వివరించారు.
జగన్ ఎంపీగా, ప్రతిపక్ష నేతగా.. సీఎంగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియదా అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. రాజ్యాంగం 190(4) స్పష్టంగా ఉందని తెలిపారు. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్కు తెలియదా అని నిలదీశారు.