YS Jagan : మీరు చేస్తే ఒప్పు.. కూటమి చేస్తే తప్పా..?

Update: 2026-02-06 05:08 GMT

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉంది అంటే.. స్కాములు చేసిన వైసీపీ నేతలను అరెస్టు చేస్తే.. ప్రతిపక్షాల మీద దాడి అంటారు. సీఎం చంద్రబాబు నాయుడును బూతులు తిట్టిన వారిని అరెస్టు చేస్తే కక్షపూరితమంటారు. పైగా మేము చేసింది పెద్ద స్కాం కాదు కదా.. అంత చిన్నదానికే అరెస్టు ఎలా చేస్తారో అని ఉల్టా ప్రశ్నిస్తారు. అలాగే అంబటి రాంబాబు బూతులు తిడితే తప్పేంటి.. ఆయన చేసిన పనికి పొగడాలి తప్ప ఎలా అరెస్టు చేస్తారని జగన్ మాట్లాడటం అందరినీ ఒకింత షాక్ కు గురిచేస్తోంది. నిన్న అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు చేసిన తప్పేంటని.. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ ఏదో బిల్డప్ ఇచ్చేసారు జగన్. కానీ ఇక్కడ జగన్ తన హయాంలో చేసిన ఘోరాలను మర్చిపోయినట్టు కనిపిస్తోంది.

సీఎం చంద్రబాబు నాయుడును నిండు అసెంబ్లీలో అత్యంత దారుణంగా అవమానించిన చరిత్ర జగన్ కే దక్కింది. అంబటి రాంబాబును అరెస్టు చేయడం తప్పు అంటున్న జగన్.. గతంలో పట్టాభిరామ్ విషయంలో చేసింది మర్చిపోయారా. అప్పుడు సీఎంగా ఉన్న జగన్ ను పట్టాభిరాం ఒక ఊత పదం అంటేనే అత్యంత దారుణంగా అరెస్టు చేయించారు జగన్. పట్టాభిరామ్ ఇంట్లో వారి మీద పోలీసులతో భయపెట్టే విధంగా పరాచకాలు చేయించి.. పట్టాభిరామ్ ఫ్యామిలీని వేధించారు. జగన్ అవినీతిని ప్రశ్నించినందుకు ఎంపీ రఘునామకృష్ణం రాజు ను కస్టడీలో హింసించిన చరిత్ర కూడా జగన్ కే దక్కింది. గన్నవరంలో టిడిపి ఆఫీసు మీద దాడి చేసింది కూడా వైసిపి హయాంలోనే కదా.

మరి దాడులు చేసిన వారందరిపై అప్పట్లో ఏమైనా కేసులు పెట్టారా. సీఎం చంద్రబాబు నాయుడు ను అప్పట్లో మంత్రులు బూతులు తిడితే ఒక్కసారి అయినా జగన్ యాక్షన్ తీసుకున్నారా. ఇవేవీ చేయకుండా ఇప్పుడు తమ పార్టీ నేతలు బూతులు తిడితే అరెస్టు చేయడం తప్పు అనటం జగన్ అవివేకానికి నిదర్శనం అని అంటున్నారు కూటమినేతలు. తన హయాంలో చేసింది ఒప్పు అయినప్పుడు.. ఇప్పుడు మీడియా ముఖంగా సీఎం చంద్రబాబు నాయుడును బూతులు తిట్టిన అంబటి రాంబాబును అరెస్టు చేయడం కూడా ఒప్పు అవుతుంది కానీ తప్పు ఎలా అవుతుంది అంటున్నారు కూటమినేతలు.

Tags:    

Similar News