అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్ అహంకారాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారు అధికారంలోకి వస్తాం అంటే అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. కానీ మేమే అధికారంలోకి వస్తాం. వచ్చిన వెంటనే అందరినీ జైళ్లలో పెడుతాం అంటూ వార్నింగ్ ఇస్తే ఏమనాలి. ఇప్పుడు జగన్ చేస్తోంది కూడా అదే. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే ఇలాంటి వార్నింగులు బాగానే వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు అంటే తాము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం, అది చేస్తాం అంటూ చెప్పుకోవాలి. అధికారంలో ఉన్న వారు ఏదైనా మంచి పని చేస్తే దాన్ని ప్రశంసించాలి. అది ఒక రాజకీయ నేతలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. కానీ జగన్ మాత్రం అలా చేయకుండా ఏపీకి పెట్టుబడీ దారులు కూడా రావొద్దన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై వైసీపీ చేస్తున్న డ్రామాలు అన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కోటి సంతకాలు అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చారు. ఆయన చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవట్లేదనే ప్రస్ట్రేషన్ లో ఉన్న జగన్.. చివరకు మీడియా ముందే అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. పీపీపీ విధానంలో ముందుకు వచ్చే ప్రైవేట్ కంపెనీలను బెదిరిస్తున్నారు. మెడికల్ కాలేజీల్లో పెట్టుబడులు పెడితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరినీ జైళ్లకు పంపిస్తాం అంటూ విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడుతున్నారు జగన్ అండ్ వైసీపీ బ్యాచ్.
ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతారా ఇలాగా. కానీ ఆయన మాత్రం ఇలా రెచ్చిపోతూ కామెంట్ చేయడం ఏంటో మరి. ఓటమిని తట్టుకోలేక జగన్ అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని.. ఇక అధికారంలోకి వస్తే ఇంకెన్ని దారుణాలకు పాల్పడుతాడో అంటూ చర్చించుకుంటున్నారు ఏపీ ప్రజలు. కాబట్టి మరోసారి జగన్ ను అధికారంలోకి రానివ్వొద్దు అంటున్నారు. జగన్ పాలన అంటేనే అరాచకాలు అని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అవే విధానాలు ఏంటని మండిపడుతున్నారు.