Pawan Kalyan : 2024లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదు : పవన్ కల్యాణ్

Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్.

Update: 2022-04-06 04:30 GMT

Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. గెలవని పార్టీ కోసం తపన పడొద్దంటూ కొందరు అధికారులను ఉద్దేశించి కామెంట్ చేశారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన ఆఫీసులో జరిగిన పార్టీ కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్..ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ సర్కార్ వైఫల్యం, నేతల అరాచకాలతో రాష్ట్రాన్ని శ్రీలంకలా తయారు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటే ఉలుకెందుకన్నారు. తాము ఎవరి పల్లకీలు మోయడానికి ఇక్కడ లేమని..ప్రజలను పల్లకి ఎక్కించేందుకే వచ్చామన్నారు.

Tags:    

Similar News