Pawan Kalyan : వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు : పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan : గుంటూరు జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-03-15 01:00 GMT

pawan Kalyan : గుంటూరు జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో జనసేనదే అధికారమన్నారు. వైసీపీ మహిషానికి కొమ్ములు విరగగొట్టి గద్దెదించుతామన్నారు. వైసీపీని గద్దె దించి.. జనసేన అధికారంలోకి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటం బహిరంగ సభలో పవన్‌ ఆవేశంగా ప్రసంగించారు. బీజేపీ రోడ్డు మ్యాప్‌ ఇస్తే..ఈ ప్రభుత్వాన్ని కూలదోయడానికి పనిచేస్తామన్నారు పవన్‌. రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని.... రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఎన్నికల సమయంలో పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు పవన్‌ కల్యాణ్‌.

అమరావతి ఎక్కడా వెళ్లదన్నారు పవన్‌ కల్యాణ్‌. సీఎంలు మారినప్పుడల్లా విధానాలు మారవన్నారు. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. రైతులు భూములిచ్చారని, రాజు మారిన ప్రతిసారి రాజధాని మారదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ అమరావతినే రాజధానిగా అంగీకరించారన్నారు. అప్పుడు వైసీపీ నేతలు ఎక్కడికళ్లారని ప్రశ్నించారు. అప్పుడేమైనా గాడిదల కాశారా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని ఇక్కడ నుంచి మారదని స్పష్టంగా చెప్పారు పవన్‌ కల్యాణ్‌..

ఏ ప్రభుత్వమైనా శుభంతో మొదలు పెడుతుందని, కానీ వైసీపీ ప్రభుత్వం వస్తూనే కూల్చివేతలతో, అశుభంతో... పాలన మొదలు పెట్టిందన్నారు పవన్‌ కల్యాణ్‌. ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పాడేసిందన్నారు. వైసీపీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అడుగడునా విధ్వంసమే కనిపిస్తుందన్నారు. అందరూ భారతదేశం నా మాతృభూమిని అని ప్రతిజ్ఞ చేస్తారని, కానీ వైసీపీ నేతలు మాత్రం అంతా వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చారంటూ విమర్శించారు.

న్యాయవ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా వైసీపీ నేతలు దుర్భషలాడతారా? అంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్‌. హైకోర్టు పార్టీ బ్రాంచ్‌ ఆఫీస్‌గా మారిందని విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్స్‌ రాజకీయాల్లో వస్తే ఇలానే ఉంటుందని, శాసనాలు చేసే వారే పాటించకపోతే.. మీ మాట ఎందుకు వినాలని ప్రశ్నించారు. చట్టాలను వైసీపీ ప్రభుత్వం పాటించకపోతే.. న్యాయదేవతను ప్రశ్నించే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు పవన్‌. 

Tags:    

Similar News