Pawan Kalyan : పవన్ సీరియస్.. జనసేన ఎమ్మెల్యే నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష

Update: 2024-09-23 10:00 GMT

కాకినాడలో వైద్యుడిపై దౌర్జన్యానికి పాల్పడిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాకినాడలోని ఎమ్మెల్యే నివాస ఆవరణలో దీక్షకు దిగారు. శనివారం రాత్రి రంగరాయ మెడికల్ కాలేజ్ వాలీబాల్ కోర్టులో ఏర్పడిన వివాదంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ జోక్యం చేసుకున్నారు. డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు.

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ వైద్య విద్యార్థులు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నానాజీ స్పందించారు. తనలా ఏ ప్రజా ప్రతినిధి ప్రవర్తించకూడదని ఎమ్మెల్యే చెప్పారు. ఎవరో చేసిన తప్పుకు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే... తాను చేసిన తప్పుకు దీక్ష చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే నానాజీ.

Tags:    

Similar News