విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు వారు ఆయనను స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌కు నివాళి అర్పించనున్నారు.