కడప జిల్లాలో పోలీసుశాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్ల 2024లో నేరాలు తగ్గాయన్నారు జిల్లా ఇన్‌చార్జ్ SP వి. విద్యాసాగర్ నాయుడు. పోలీసుల సమిష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. రాబోయే సంవత్సరంలో అదే ఉత్సాహంతో ప్రజలకు ఉత్తమమైన సేవలను అందిస్తామన్నారు. ఈ ఏడాది నేరాలను 31 శాతం తగ్గించామన్నారు. సెబర్ నేరాలకు సంబంధించి ఈ ఏడాది 58 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న మొత్తంలో 50 శాతానికి పైగా రికవరీ చేశామన్నారు. ఈ కేసుల్లో సైబర్ నేరగాళ్లకు చెందిన మొత్తం 135 బ్యాంక్ అకౌంట్లను గుర్తించి అందులోని డబ్బును ఫ్రీజ్ చేశామన్నారు SP విద్యాసాగర్ నాయుడు.