ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన కడపజిల్లా టీడీపీ నేతలు
ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఎస్‌ఈసీకి వివరించామన్నారు టీడీపీ నేతలు.;
ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిశారు కడప టీడీపీ సీనియర్ నేతలు. ఎస్‌ఈసీని కలిసిన వారిలో లింగారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, రాష్ట్రఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి, బీసీ నేత పుట్టా సుధాకర్ యాదవ్‌లు ఉన్నారు. జిల్లాలో పరిస్థితిని వివరించినట్లు తెలిపారు.
గతంలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయని, ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఎస్‌ఈసీకి వివరించామన్నారు టీడీపీ నేతలు. అప్పట్లో పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేశారని..కడపజిల్లాపై ప్రత్యేక నిఘాపెట్టాలని ఈసీని కోరినట్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి పోలీస్ సర్టిఫికెట్ కావాలని కొత్తగా అడిగారని, అయితే.. అలాంటి నిబంధన ఏమీ లేదని ఈసీ నిమ్మగడ్డ స్పష్టం చేసినట్లు తెలిపారు.