kadapa: కడప గడ్డపై ప్రజాస్వామ్య విజయం
జగన్ అరాచకాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు... ఇది ప్రజాస్వామ్య విజయమన్న చంద్రబాబు;
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించింది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. 11 మంది నామినేషన్లు వేయడమే దీనికి సాక్ష్యం అన్నారు. జగన్‌లా నియంతృత్వం చేయాలనుకుంటే ఒక్కరు కూడా నామినేషన్ వేసి ఉండే వారు కాదని చంద్రబాబు పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని ఓటర్లు కొందరు స్లిప్పులు కూడా పెట్టారన్నారు. 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నామని ఓటర్లు ఆనందంగా ఉన్నారని అన్నారు. జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని వెల్లడించారు.
బాలయ్య హర్షణీయం
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ స్పందించారు. గతంలో పులివెందుల ఎన్నికలు అప్రజాస్వామ్యంగా జరిగాయని, కానీ కూటమి ప్రభుత్వం తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ఎన్నికలు నిర్వహించిందన్నారు. పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తమకు నచ్చినవారిని ఎన్నుకొని పులివెందుల ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారని చెప్పారు.
జగన్‌కు బుద్ధి చెప్పారు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయంపై ఆ పార్టీ నేత బీటెక్ రవి స్పందించారు. గతంలో పులివెందులలో ధైర్యంగా ఓట్లు వేసే పరిస్థితులు లేవన్నారు. ధైర్యంగా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తాము ప్రజలకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ‘‘ఇవాళ స్వేచ్ఛాయత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేశారు. జగన్‌కు బుద్ధి చెప్పాలనే ప్రజల ఆలోచన, తెదేపా అమలుచేసిన పథకాలే పార్టీ విజయానికి దోహదం చేశాయి’’ అని బీటెక్ రవి అన్నారు.
పులివెందుల సీటు మాదే
టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయంపై మంత్రి సవిత స్పందించారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధే టీడీపీని గెలిపించిందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ సీటు తమదే అన్నారు.