కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.