Nara Lokesh : ఏపీపై కర్ణాటక ఐటీ మంత్రి అక్కసు.. లోకేష్ ను చూసి ఓర్వలేకనే..

Update: 2025-10-18 17:00 GMT

ఏపీపై కర్ణాటక ఐటీ మంత్రి అక్కసు బయటపెడుతున్నారు. ఇప్పుడు ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఎందుకంటే గూగుల్ సంస్థ అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడులు విశాఖలోనే పెడుతోంది. దీని వెనకాల లోకేష్ శ్రమ ఎంతో ఉంది. లోకేష్ స్వయంగా గూగుల్ సంస్థ ఆఫీస్ కు వెళ్లి మరీ వాళ్లను ఒప్పించాడు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చేశాడు. దీంతో కర్ణాటక ఐటీ మంత్రిపై అక్కడి యూత్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. లోకేష్ ను చూసి నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రియాంక ఖర్గేను ట్రోల్ చేస్తున్నారు. దాంతో ఆయన ఏపీ మీద అక్కసు బయటపెడుతున్నారు. గూగుల్ రావడంలో పెద్ద వింతేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఖర్గే.

గూగుల్ కు ఏపీ ప్రభుత్వం రూ.22వేల కోట్ల ప్రోత్సాహకాలు, భూమిపై 25 శాతం డిస్కౌంట్, నీళ్లపై టారిఫ్ లో 25 శాతం డిస్కౌంట్, ట్రాన్స్ మిషిన్ 100 శాతం ఉచితంగానే ఇస్తున్నారని ప్రియాంక ఖర్గే ఆరోపించారు. ఇవన్నీ చెప్పకుండా కేవలం గూగుల్ వస్తోందని మాత్రమే చెప్తున్నారని.. అలా తాము కూడా ఇస్తే రాష్ట్ర సంపద కుప్పకూలిపోతుందన్నారు. ఏ రాష్ట్రానికి అయినా ఎకో సిస్టమ్ రావాలంటే డిస్కౌంట్ లు ఇవ్వాల్సిందేనని తెలిపారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. బెంగుళూరు లాంటి ఆల్రెడీ డెలవప్ అయిన నగరాన్ని, వెనకబడ్డ ఏపీతో పోల్చలేమన్నారు. కర్ణాటకలో ఆల్రెడీ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. కానీ అలాంటి నగరాలను కాదని విశాఖకు పెట్టుబడులు తేవడం ఛాలెంజ్ లాంటిదేనన్నారు.

గూగుల్ వచ్చాక చాలా కంపెనీలు ఏపీకి వస్తాయని.. ఆ కంపెనీకి ఇలా డిస్కౌంట్ లు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక కర్ణాటక మంత్రి కామెంట్లపై లోకేష్ స్పందించారు. ఎక్స్ లో ట్వీట్ చేస్తూ.. ఏపీ వంటకాల ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఏపీకి వచ్చిన పెట్టుబడులకు కూడా కారం ఎక్కువే. ఇప్పటికే పొరుగువారికి తగులుతోందన్నారు. ఈ ట్వీట్ పై ప్రియాంక ఖర్గే స్పందించారు. ఆహారంలో కారం ఉంటే సరిపోదు పోషకాల సమతుల్యత కూడా ఉండాలి. పొరుగు రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటిపోయాయి. వాళ్ల సంపద పెద్దగా పెరగట్లేదు. అవన్నీ కప్పి పుచ్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారు. ఇక్కడే ఆయన పనితనం ఏంటో అందరికీ కనిపిస్తోంది. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కర్ణాటకకు పెట్టుబడులు తీసుకురావాలి. అంతేగానీ ఏపీకి గూగుల్ వస్తే భరించలేక ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు.


Full View

Tags:    

Similar News