ఏపీలో సంచలనం రేపిన కల్తీ మద్యం కేసు.. ఇప్పుడు వేగంగా ముందుకెళ్తోంది. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నా అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్, సిట్ విచారణలో ఉన్నాడు. ఆయనను వారం రోజులపాటు కష్టపడిలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టినట్లు సమాచారం అందుతుంది. జోగి రమేష్ సపోర్టుతోనే తాను కల్తీ మద్యం దందాలోకి దిగినట్టు జనార్దన్ రావు పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు. జోగి రమేష్ తనకు మూడు కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడని.. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిల్లరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశ చూపించడంతోనే తాను ఈ కల్తీ మద్యం తయారీలోకి వచ్చినట్టు అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసుల ముందు ఒప్పేసుకున్నాడు. జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలోనే 2023 నుంచి ఈ కల్తీ మద్యం తాము తయారు చేస్తున్నట్టు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు వివరించారు.
జనార్దన్ రావు చెప్పిన దాన్ని కోర్టు ఆదేశాల ప్రకారం వీడియో చిత్రీకరించారు సిట్ అధికారులు. 2023 నుంచి తాము మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని.. అక్కడి నుంచి ఈ దందా కొనసాగిందని జనార్దన్ రావు తెలిపారు. అక్కడ ఈ కల్తీ మద్యం దందా నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా జయచంద్ర రెడ్డి అండగా ఉంటారు అనే ఉద్దేశంతోటే అక్కడి నుంచి దందా చేసినట్టు తెలిపారు. ఆఫ్రికా వెళ్లే ముందు కూడా ఈనెల 23న జోగి రమేష్ ఇంటికి కూడా తాను వెళ్లానని ఒప్పేసుకున్నారు. దీంతో సిట్ అధికారులు జోగి రమేష్ ఇంటి సీసీ ఫుటేజ్ ను సేకరించే పనిలోపడ్డారు. జనార్ధన్ రావు తాను చెప్పిన వివరాలను రాతపూర్వకంగా సిట్ అధికారులకు అందజేశారు.
సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జోగి రమేష్ ను అరెస్టు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జోగి రమేష్ మాత్రం తనది ఏమీ తప్పు లేదన్నట్టు.. రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నాడు. ముందు జనార్దన్ రావు తనకు తెలుసన్నాడు. తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని.. ఇద్దరం కలిసి కొన్ని వ్యాపారాలు చేసినట్టు తెలిపాడు. ఆ తర్వాత జగన్ నుంచి ఆదేశాలు రావడంతో.. అసలు జనార్దన్ రావు తో పెద్దగా సంబంధాలు లేవని.. అప్పుడు ఎప్పుడో ఒకసారి కలిశాం తప్ప తనకు కల్తీ మద్యం దందాలో ఎలాంటి సంబంధం లేదని మాట మార్చేశాడు. ఇంకోవైపు మాజీ సీఎం జగన్ అసలు జోగి రమేష్ కు, జనార్దన్ రావు అంటే ఎవరో తెలియదని.. కావాలని కూటమి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఒక అద్భుతమైన అబద్ధం ఆడేశారు. పోలీసులు ఇప్పుడు జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్, ఆయన సోదరుడు రాము మీద చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. మొత్తంగా ఈ కేసు జోగి రమేష్ చుట్టూ తిరుగుతూనే ఉంది.