Kodali Nani: బంద్ చేస్తామని బెదిరిస్తే ఎవరూ భయపడరు: కొడాలి నాని
Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో రెండోరోజు రేషన్ డీలర్ల నిరసనలు కొనసాగుతున్నాయి.;
Kodali Nani (tv5news.in)
Kodali Nani: ఆంధ్రప్రదేశ్‌లో రెండోరోజు రేషన్ డీలర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. M.L.S పాయింట్ల వద్ద ఆందోళనలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు వస్తున్న నవంబరు నెల స్టాకును డీలర్లు దింపవద్దని ఆ సంఘం నిర్ణయించింది. దీంతో రేషన్ దిగుమతి, పంపిణీ నిలిచిపోయింది. ఇంటింటికీ సరకుల పంపిణీ వచ్చాక ఆదాయాన్ని కోల్పోయామని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు.
అటు.. నిన్న పౌరసరఫరాల శాఖ అధికారుల చర్చలూ విఫలమయ్యాయి.2020 P.M.G.K.Y కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. డీడీ డబ్బు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలన్నారు. డీలర్ల నుంచి I.C.D.Sకు పంపిణీ చేసిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలంటున్నారు.
గతేడాది మార్చి 29 నుంచి నేటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలని పట్టుబడుతున్నారు. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే 20 చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయబోమనడం సరికాదన్నారు రేషన్ డీలర్లు. గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్ కట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించడం దుర్మార్గమన్నారు.
జీవో నెంబర్ 10ని రద్దు చేసి ఖాళీ సంచులను తమకే ఇవ్వాలంటున్నారు. ఇప్పటికే పెరిగిన ఖర్చులు, షాపు అద్దెలు, విద్యుత్ చార్జీలను మోయలేక అవస్థలు పడుతూనే రేషన్ షాపులు నడుపుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే సంపూర్ణ బంద్‌కు దిగుతామని స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కానీ, బంద్ చేస్తామని బెదిరింపులకు దిగితే ఎవరు భయపడబోరన్నారు మంత్రి కొడాలి నాని.
రేషన్ వాహనాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని వాటి ద్వారా ప్రజలకు రేషన్ సరుకులు అందిస్తామని వెల్లడించారు. రేషన్ డీలర్ల ఆందోళనలకు టీడీపీ మద్దతు తెలిపింది. వారి సమస్యలు పరిష్కరించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరో