మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కోల్‌కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. ఆ తర్వాత ఆయనకు గుండె సంబంధింత సర్జరీ చేశారు. ముంబైలో ఉన్నారని, త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఆయన కోల్ కతా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.