Lanka Villages : ముంపులో గోదావరి లంక గ్రామాలు..

Godavari Floods : పునరావాస కేంద్రాల్లో ఉండలేక అంతులేని అవేదనలో లంక గ్రామాలవాసులు బిక్కుబిక్కుమంటున్నారు.

Update: 2022-07-19 04:45 GMT

Godavari Floods : వరద నీటిలో బాధితులు నరకయాతన పడుతున్నారు. ఇళ్లను వదలి వెళ్లలేక, పునరావాస కేంద్రాల్లో ఉండలేక అంతులేని అవేదనలో లంక గ్రామాలవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. రాజోలు, ముమ్మిడివరం గ్రామాలకు తీవ్ర నష్టం వాటల్లింది. రాజోలు మేకలపాలెం నుంచి నున్నవారిబాడువ వరకు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అటు బి.దొడ్డవరం, అప్పనపల్లి, పెదపట్నం, పాశర్లపూడి, అప్పన రామునిలంక, కనకాయలంక, పెదలంక, రామరాజులంక, సఖినేటి పల్లి లంక గ్రామా ప్రజలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, కపిలేశ్వరపురంలో ముంపు బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. .

ఏళ్లుగా ఆధునికీకరణ పనులు చేపట్టకపోవటంతో...ప్రవాహ వేగానికి గట్లపైనుంచే వరద ఉప్పొంగుతోంది. దీంతో గట్టుపక్కన ముంపునకు గురైన బాధితులు 30 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బలవంతంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా వరరామచంద్రాపురం మండలం చింతరేవుపల్లిలో 800 కుటుంబాలు సమీపంలోని గుట్టపై తలదాచుకున్నాయి....VIS

అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకా 31 లంక,తీర గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి తగ్గినా.. సముద్రంలోకి నీటిని వదలటంతో ఉప్పొంగిన వశిష్ఠ గోదావరితో జిల్లాపై పెనుప్రభావం పడింది. దీంతో జిల్లాలోని యలమంచిలి మండలంలో తొమ్మిది, ఆచంట మండలంలో ఐదు, నరసాపురం మండలంలో రెండు గ్రామాలు నీటమునిగాయి.

నరసాపురం పట్టణంలోని మూడు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పొన్నపల్లి వద్ద గోదావరిగట్టుపై 15 మీటర్ల మేర రైలింగ్‌ కొట్టుకుపోవటంతో... గండిపడుతుందన్న భయంతో ప్రజలు తెల్లవార్లూ జాగారం చేశారు. పాలకొల్లు-నరసాపురం ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అటు జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాల్లో 11వేల మంది నిర్వాసితులు తలదాచుకుంటుండగా... అటు ముంపు పల్లెల్లోనే పదివేల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడిచారు

అటు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఇంకా తేరుకోలేదు. ఈ మండలాల్లోని 80కి పైగా అవాస ప్రాంతాలు చీకటిలోనే మగ్గుతున్నాయి. 61 గ్రామాలకు చెందిన 126 నివాసిత ప్రాంతాలు ముంపునకు గురయినట్లు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.

ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గినా... ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం ఇంకా డేంజర్‌ లెవల్‌లోనే ప్రవహిస్తోంది.ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 18 అడుగుల మేర తగ్గింది. మరికాస్తా తగ్గితే మూడో ప్రమాద హెచ్చరిక ఉపససంహరించనున్నారు. ప్రస్తుతం సుమారు 19 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. .

అటు మంపునకుగురైన లంకగ్రామాల్లో వరద సాయం అంతంతమాత్రంగానే అందుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అటు పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై ఇవాళ యానంలో పర్యటించనున్నారు. ముంపుబారినపడ్డ ప్రాంతాలను తమిళిసై పరిశీలించనున్నారు. అనంతరం వరదసాయంపై అధికారులతో సమీక నిర్వహించనున్నారు. .

Tags:    

Similar News