LOCAL ELECTIONS: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సమర సన్నాహాలు

ఏపీ, తెలంగాణల్లో స్థానిక ఎన్నికల వేడి... ఏపీ ఎన్నికల కమిషనర్‌తో నారాయణ భేటీ...\ ఎన్నికలపై ఇప్పటికే లేఖలు రాసిన మంత్రి

Update: 2025-11-22 04:30 GMT

తె­లు­గు రా­ష్ట్రా­ల్లో స్థా­నిక సం­స్థల ఎన్ని­కల వేడి పె­రి­గిం­ది. రెం­డు రా­ష్ట్రా­ల్లో­నూ స్థా­నిక సమ­రా­ని­కి సన్నా­హా­లు చే­స్తుం­డ­డం­తో గ్రా­మా­ల్లో రా­జ­కీయ కాక పె­రి­గిం­ది. స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు సన్న­ద్ధం కా­వా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఈ నెల 19న టీ­డీ­పీ ఎమ్మె­ల్యే­లు, నా­య­కు­ల­తో ని­ర్వ­హిం­చిన టె­లి­కా­న్ఫ­రె­న్స్‌­లో సూ­చిం­చా­రు. ఇటు­వై­పు రే­వం­త్‌­రె­డ్డి కూడా ఎన్ని­క­ల­కు సి­ద్ధం­గా ఉం­డా­ల­ని ఇప్ప­టి­కే సూ­చిం­చా­రు.

 ఈసీతో మంత్రి నారాయణ భేటీ

మూ­ణ్నా­లు­గు నె­ల­ల్లో ఎన్ని­క­లొ­స్తు­న్నా­య­ని, ఇప్ప­టి నుం­చే ప్ర­జ­ల్లో ఉం­డా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు ఇప్ప­టి­కే సూ­చిం­చా­రు. దీం­తో ప్ర­భు­త్వం స్థా­నిక సమ­రా­ని­కి సి­ద్ధ­మ­వు­తోం­ద­న్న వి­ష­యం స్ప­ష్ట­మ­వు­తోం­ది. 2021 ఫి­బ్ర­వ­రి­లో పం­చా­య­తీ­ల­కు, అదే ఏడా­ది మా­ర్చి­లో ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­రు. ప్ర­స్తుత పా­ల­క­వ­ర్గాల పదవీ కా­లం­లో మరో నా­లు­గు నె­ల­ల్లో ము­గి­య­నుం­ది. మూడు నె­ల­లు ముం­దు­గా డి­సెం­బ­రు­లో ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని ఎన్ని­కల సంఘం యో­చి­స్తోం­ది. రా­ష్ట్ర ప్ర­భు­త్వ సన్న­ద్ధత లే­కుం­డా ఎన్ని­కల ని­ర్వ­హణ సా­ధ్యం కాదు. రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్‌ లే­ఖ­ల­పై ప్ర­భు­త్వం నుం­చి అధి­కా­రి­కం­గా ఇంకా సమా­ధా­నం రా­లే­దు. మరో­వై­పు స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­కు ప్ర­భు­త్వం నుం­చి సం­కే­తా­లు వె­లు­వ­డు­తు­న్న నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం అం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తోం­ది. 175 అసెం­బ్లీ ని­యో­జ­క­వ­ర్గాల ఓట­ర్ల జా­బి­తా­లు రా­ష్ట్ర ఎన్ని­కల ప్ర­ధాన అధి­కా­రి కా­ర్యా­ల­యం నుం­చి తీ­సు­కుం­ది. వీటి నుం­చి ము­న్సి­ప­ల్, పం­చా­య­తీల వా­రీ­గా ఓట­ర్ల జా­బి­తా­లు సి­ద్ధం చే­య­ను­న్నా­రు. ఇం­దు­కో­సం ము­న్సి­ప­ల్, పం­చా­య­తీ­ల్లో మా­స్ట­ర్‌ ట్రై­నీ­ల­కు శి­క్షణ ఇచ్చా­రు. ప్ర­భు­త్వం రి­జ­ర్వే­ష­న్లు ఖరా­రు చే­య­డ­మే తడ­వు­గా ఎన్ని­కల నో­టి­ఫి­కే­ష­న్‌ ఇవ్వా­ల­న్న యో­చ­న­తో ఎన్ని­కల సంఘం ఉంది. ఈ నే­ప­థ్యం­లో రా­ష్ట్ర ఎన్ని­కల కమి­ష­న­ర్‌ నీలం సా­హ్ని­ని పు­ర­పా­లక, పట్ట­ణా­భి­వృ­ద్ధి­శాఖ మం­త్రి నా­రా­యణ శు­క్ర­వా­రం కల­వ­డం ప్రా­ధా­న్యం సం­త­రిం­చు­కుం­ది. స్థా­నిక సం­స్థ­ల­కు ఎన్ని­కల ఏర్పా­ట్ల­పై ఎన్ని­కల సంఘం పు­ర­పా­లక, పం­చా­య­తీ­రా­జ్‌ శా­ఖ­ల­కు వే­ర్వే­రు­గా ఇటీ­వల లే­ఖ­లు రా­సిం­ది. ప్ర­భు­త్వ సన్న­ద్ధ­త­పై మం­త్రి నా­రా­యణ ఎన్ని­కల కమి­ష­న­ర్‌­తో చర్చిం­చి­న­ట్లు తె­లు­స్తోం­ది.రా­ష్ట్ర ఎన్ని­కల సంఘం ప్ర­తి­పా­ద­నల ప్ర­కా­ర­మై­తే డి­సెం­బ­రు­లో ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చే అవ­కా­శా­లు కని­పిం­చ­డం లేదు. రి­జ­ర్వే­ష­న్ల­కు సం­బం­ధిం­చిన ప్ర­క్రియ పూ­ర్తి­కి 30-45 రో­జుల సమయం అవ­స­ర­మ­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా­రు. పం­చా­య­తీ, ము­న్సి­ప­ల్‌ ప్ర­స్తుత పా­ల­క­వ­ర్గాల పదవీ కాలం ము­గి­శా­కే ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చే అవ­కా­శా­లు­న్నా­య­ని అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు.

తెలంగాణలోనూ...

స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల­పై ఇటీ­వల తె­లం­గాణ మం­త్రి­వ­ర్గం కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. పాత రి­జ­ర్వే­ష­న్ల వి­ధా­నం­లో­నే గ్రా­మ­పం­చా­య­తీ ఎన్ని­క­లు జర­పా­ల­ని కే­బి­నె­ట్‌ తీ­ర్మా­నిం­చిం­ది. ఎం­పీ­టీ­సీ, జె­డ్పీ­టీ­సీ, ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­లు మా­త్రం బీ­సీ­ల­కు 42శాతం రి­జ­ర్వే­ష­న్ల­పై వి­వా­దం తే­లిన తర్వా­తే ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. కో­ర్టు­ల్లో పం­చా­య­తీ ఎన్ని­క­ల­పై మా­త్ర­మే వి­వా­దం ఉన్నం­దున వా­టి­ని ముం­దు­గా ని­ర్వ­హిం­చా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. డి­సెం­బ­ర్‌ 20 లోపు పం­చా­య­తీ ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­ల­ని హై­కో­ర్టు స్ప­ష్టం­గా ఆదే­శిం­చి­నం­దున ముం­దు­గా వా­టి­ని పూ­ర్తి చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. డి­సెం­బ­రు నె­ల­లో­నే పం­చా­య­తీ ఎన్ని­క­ల­ను పూ­ర్తి చే­సే­లా కస­ర­త్తు చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను కే­బి­నె­ట్ ఆదే­శిం­చిం­ది. BC రి­జ­ర్వే­ష­న్ల­పై కే­సు­లు కో­ర్టు­ల్లో తే­లేం­దు­కు సమయం పట్ట­ను­న్నం­దున ఇప్ప­టి­కే హై­కో­ర్టు, సు­ప్రీం కో­ర్టు సూ­చ­నల ప్ర­కా­రం 50శాతం రి­జ­ర్వే­ష­న్ల­తో­నే ఎన్ని­క­ల­కు వె­ళ్లా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు.

Tags:    

Similar News