LOCAL WAR: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
సర్పంచ్ ఎన్నికల్లో హస్తం సత్తా... మూడు దశల్లోనూ సాధికార విజయాలు... పర్వాలేదనిపించిన గులాబీ పార్టీ
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. తొలి రెండు విడతల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ.. మూడు విడతలోనూ అదే జోరు కొనసాగించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ దశ మారిపోయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో డీలా పడిన సంగతి తెలిసిందే. గెలిచిన అభ్యర్థులు కూడా రాత్రికి రాత్రే బీఆర్ఎస్ కండువాలు కప్పేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో క్షేత్రస్థాయిలో హస్తం పార్టీ పరిస్థితి మారిపోయింది. తొలి, మలి, చివరి విడత ృసర్పంచ్ ఎన్నికల్లో సగానికిపైగా సీట్లలో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలిచారు. జిల్లాల వారీగానూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. స్థానిక ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. దీంతో సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. మహబూబ్‌నగర్, సంగారెడ్డి సహా 20 జిల్లాల్లోనైతే సగానికంటే ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. ఏకగ్రీవమైన 415 పంచాయతీల్లో 90 శాతానికిపైగా కాంగ్రె్‌సవే కావడం విశేషం. మలి విడత ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 25 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఊరట కలిగించే అంశమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి, రెండో, మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో 25 శాతానికి పైగా సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో ఆ పార్టీ తన ఉనికిని చాటుకుందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది బీఆర్‌ఎ్‌సకు పెద్ద ఊరటేనని విశ్లేషకులు చెబుతున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4,159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి(రాత్రి 12.30 గంటల వరకు) కాంగ్రెస్ మద్దతుదారులు 2,286 స్థానాలను గెలిచారు. భారాస 1,142, భాజపా 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సీపీఐ మద్దతుదారులు 24 చోట్ల, సీపీఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో భారాస గెలుపొందింది. భాజపా 688 స్థానాలు పొందగా... ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తు న్న బీజేపీ.. పంచాయతీ ఎన్నికల్లోనూ తన బలాన్ని చూపలేకపోయింది. బీజేపీ గెలుచుకున్న సీట్లలో సింహభాగం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలవే కావడం గమనార్హం. అంటే ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో బీజేపీ వాటా కేవలం ఆరు శాతం. కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితుల వల్ల తిరుగులేని నేతగా ఎదగడానికి అవకాశం ఉండదు. ఎప్పటికప్పుడు కాళ్లు, చేతులు కట్టేస్తూనే ఉంటారు. అయినా రేవంత్ తన పట్టు నిరూపించుకుంటూనే ఉన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడల్లా అండగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సమకూర్చారు. జాతీయ రాజకీయాలకు ఆయన వ్యూహాలే దిక్సూచీ అయ్యాయి. రెండేళ్లలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. రెండింటిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుని ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంది.