విశాఖ జిల్లాలో డోలీ కట్టి గర్భిణీని వాగు దాటించిన ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి దృశ్యాలు మరోసారి కనిపించకూడదన్న గతంలో సీఎం ఆదేశాలున్నాయి. రవాణా మార్గాలు మెరుగుపరచాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఐతే..విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణిని డోలీ కట్టి తీసుకెళ్లారు. డోలీలోనే వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. తమకు ఈ డోలీ కష్టాలు తొలగించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.