LOKESH: మరో హామీ నెరవేర్చాం: నారా లోకేశ్

ఖాళీలను బట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్న లోకేశ్

Update: 2025-09-16 04:00 GMT

ఎప్పు­డె­ప్పు­డా అని ఎదు­రు­చూ­స్తు­న్న ఏపీ మెగా డీ­ఎ­స్సీ మె­రి­ట్ అభ్య­ర్థు­ల­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం శు­భ­వా­ర్త అం­దిం­చిం­ది. ఏపీ మెగా డీ­ఎ­స్సీ నో­టి­ఫి­కే­ష­న్ పో­స్టు­ల­కు సం­బం­ధిం­చి ఎం­పి­కైన అభ్య­ర్థుల తుది జా­బి­తా­ను ఏపీ వి­ద్యా­శాఖ వి­డు­దల చే­సిం­ది. ఏపీ మెగా డీ­ఎ­స్సీ తుది ఫలి­తాల వి­డు­ద­ల­పై వి­ద్యా­శాఖ మం­త్రి లో­కే­ష్ హర్షం వ్య­క్తం చే­శా­రు. మరో వా­గ్దా­నం నె­ర­వే­రిం­ద­న్నా­రు. ఏపీ సీ­ఎం­గా చం­ద్ర­బా­బు పదవీ బా­ధ్య­త­లు స్వీ­క­రిం­చిన తర్వాత సం­త­కం చే­సిన మొ­ట్ట­మొ­ద­టి ఫైల్ మెగా డీ­ఎ­స్సీ అని లో­కే­ష్ గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. 150 రో­జుల కంటే తక్కువ సమ­యం­లో పా­ఠ­శాల వి­ద్యా శాఖ ఏపీ మెగా డీ­ఎ­స్సీ 2025ను వి­జ­య­వం­తం­గా పూ­ర్తి­చే­య­డం­పై హర్షం వ్య­క్తం చే­శా­రు. తుది ఎం­పిక జా­బి­తా­లో పే­ర్లు ఉన్న వి­జ­యం సా­ధిం­చిన అభ్య­ర్థు­లం­ద­రి­కీ నారా లో­కే­ష్ హృ­ద­య­పూ­ర్వక అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఎన్ని­కల సమ­యం­లో ఇచ్చిన కీలక హా­మీ­ల్లో ఒకటి మెగా డీ­ఎ­స్సీ ద్వా­రా టీ­చ­ర్ పో­స్టు­లు భర్తీ చే­య­డం.

ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల

ఏపీ మెగా డీ­ఎ­స్సీ తుది ఎం­పిక జా­బి­తా­ను రా­ష్ట్ర వి­ద్యా­శాఖ వి­డు­దల చే­సిం­ది. ఎం­పి­కైన వారి వి­వ­రా­ల­ను మెగా డీ­ఎ­స్సీ వె­బ్‌­సై­ట్‌­లో అం­దు­బా­టు­లో­కి తీ­సు­కొ­చ్చిం­ది. ఈ మే­ర­కు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. ఎం­పిక జా­బి­తా­ను జి­ల్లా కలె­క్ట­ర్, జి­ల్లా వి­ద్యా­శా­ఖా­ధి­కా­రి కా­ర్యా­ల­యా­ల్లో­నూ అం­దు­బా­టు­లో ఉం­చ­ను­న్నా­రు. జి­ల్లా వి­ద్యా­శాఖ అధి­కా­రి, కలె­క్ట­రే­ట్ల­లో డీ­ఎ­స్సీ తుది జా­బి­తా­ను చెక్ చే­సు­కో­వ­చ్చు అని తె­లి­పిం­ది.ఇక­పో­తే కూ­ట­మి ప్ర­భు­త్వం 16347 పో­స్టుల భర్తీ­కి నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చేసి ని­యా­మ­కాల భర్తీ­ని చే­ప­ట్టిం­ది.అయి­తే ఫై­న­ల్ లి­స్టు­ను పా­ఠ­శాల వి­ద్యా­శాఖ వి­డు­దల చే­సిం­ది. ఎం­పి­కైన అభ్య­ర్థుల జా­బి­తా­ను ఆయా జి­ల్లాల కలె­క్ట­ర్, డీ­ఈ­వో కా­ర్యా­ల­యా­ల­లో ప్ర­ద­ర్శిం­చిం­ది. అం­తే­కా­దు అధి­కా­రిక వె­బ్‌­సై­ట్ apdsc.apcfss.in లో కూడా అం­దు­బా­టు­లో ఉం­చి­న­ట్లు డీ­ఎ­స్సీ-2025 కన్వీ­న­ర్ ఎంవీ కృ­ష్ణా­రె­డ్డి ఓ ప్ర­క­ట­న­లో తె­లి­య­జే­శా­రు.

మిగిలిపోయిన పోస్టులు

మొ­త్తం 16,347 పో­స్టుల భర్తీ­కి నో­టి­ఫి­కే­ష­న్ వి­డు­దల చే­సిం­ది ప్ర­భు­త్వం. అయి­తే 16 వేల పో­స్టు­ల­కు మా­త్ర­మే అభ్య­ర్థు­ల­ను ఎం­పిక చే­య­నుం­ది.కొ­న్ని మే­నే­జ్‌­మెం­ట్లు, పలు సా­మా­జిక వర్గా­ల్లో అర్హు­లైన అభ్య­ర్థు­లు అం­దు­బా­టు­లో లే­క­పో­వ­డం­తో 347కు పైగా పో­స్టు­లు మి­గి­లి­పో­యి­న­ట్లు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు.తొ­లుత 600కు పైగా పో­స్టు­లు మి­గి­లి­పో­యా­యి. దీం­తో వీ­లై­న­న్ని ఎక్కువ పో­స్టు­ల­ను భర్తీ చే­సేం­దు­కు ఏడు వి­డ­త­లు­గా ప్ర­భు­త్వం సర్టి­ఫి­కె­ట్ల పరి­శీ­లన ని­ర్వ­హిం­చిం­ది. ఏపీ మెగా డీ­ఎ­స్సీ ఫై­న­ల్‌ సె­ల­క్ష­న్‌ లి­స్ట్‌­లో ఎం­పి­కైన అభ్య­ర్థు­ల­కు వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్‌ శు­భా­కాం­క్ష­లు తె­లి­పా­రు. మెగా డీ­ఎ­స్సీ వా­గ్దా­నం నె­ర­వే­రిం­ద­ని.. ఈ మై­లు­రా­యి తన బా­ధ్య­త­ను మరింత పెం­చిం­ద­ని పే­ర్కొ­న్నా­రు. ఫై­న­ల్‌ జా­బి­తా­లో లేని అభ్య­ర్థు­లు ని­రు­త్సా­హ­ప­డొ­ద్ద­ని సూ­చిం­చా­రు. హామీ ఇచ్చి­న­ట్లు­గా ప్ర­తి ఏటా డీ­ఎ­స్సీ­ని ని­ర్వ­హి­స్తా­మ­ని పు­న­రు­ద్ఘా­టిం­చా­రు. దృఢ సం­క­ల్పం­తో ఉం­డం­డి.. డీ­ఎ­స్సీ­కి సన్న­ద్ధ­మ­వ్వం­డి.. మీ అవ­కా­శం కోసం ఎదు­రు­చూ­డం­డి అని సూ­చిం­చా­రు.

Tags:    

Similar News