lokesh: 30 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ: లోకేశ్
పులివెందుల గెలుపుపై కూటమి మంత్రుల హర్షం;
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి లోకేశ్ స్పందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని కాదని, పురోగతికి పట్టం కట్టారని పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు.
సంక్షోభంలో వైఎస్ జగన్ భవిష్యత్తు
మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహర శైలి, అతి విశ్వాసం ఆయనకు ఒంటరితనాన్ని తెచ్చిపెట్టింది. బీజేపీపై స్పష్టత లేకపోవడం, మిత్రపక్షాలతో స్నేహం చేయడం ఫెయిల్ అవ్వడం, బలమైన పోరాటం చేయకపోవడం వంటి కారణాలు 2014, 2024లో ఓటమికి కారణాలు. తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలూ దానిని మరోసారి ఫ్రూవ్ చేశాయి. ఇలానే సాగితే ఆయన రాజకీయ భవిష్యత్తు సంక్షోభంలో పడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
30 ఏళ్ల తర్వాత ఓటేశా..
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 25 ఓట్లను ఒక కట్టగా కట్టేటప్పుడు అందులోనుంచి ఓ స్లిప్ బయటపడింది. ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేశాడు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేసినందుకు సంతోషంగా ఉందని ఓటరు అందులో పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నా.. ప్రజలను పోలింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందనేందుకు ఇదే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు.