LOKESH: ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన.. ఆస్ట్రేలియాలో సాగుతున్న పెట్టుబడుల వేట.. ఆస్ట్రేలియా నైపుణ్యాభివృద్ధి మంత్రితో భేటీ

Update: 2025-10-20 10:00 GMT

ఏపీ­లో యు­వ­త­కు అం­త­ర్జా­తీయ స్థా­యి­లో నై­పు­ణ్య శి­క్షణ అం­దిం­చి, ఉపా­ధి అవ­కా­శా­లు మె­రు­గు­ప­రి­చే లక్ష్యం­తో రా­ష్ట్ర ఐటీ, వి­ద్యా­శాఖ మం­త్రి నారా లో­కే­శ్‌ ఆస్ట్రే­లి­యా­లో పర్య­టి­స్తు­న్నా­రు. ఈ పర్య­ట­న­లో భా­గం­గా ఆయన సి­డ్నీ­లో­ని ప్ర­ఖ్యాత ప్ర­భు­త్వ వృ­త్తి వి­ద్యా సం­స్థ టీ­ఏ­ఎ­ఫ్ఈ ఎన్ఎ­స్‌­డ­‌­బ్ల్యూ(టె­క్ని­క­ల్ అండ్ ఫర్ద­ర్ ఎడ్యు­కే­ష­న్) అల్టి­మో క్యాం­ప­స్‌­ను సో­మ­వా­రం సం­ద­ర్శిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా ఏపీ­లో నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చి పలు కీలక ప్ర­తి­పా­ద­న­లు చే­శా­రు. తర్వాత సి­డ్నీ రాం­డ్వి­క్‌­లో­ని యూ­ని­వ­ర్సి­టీ ఆఫ్ నా­ర్త్ సౌత్ వే­ల్స్‌(యూ­ఎ­న్‌­ఎ­స్‌­డ­బ్ల్యూ)ను ఆయన సం­ద­ర్శిం­చా­రు. వర్సి­టీ ప్ర­తి­ని­ధు­లు లో­కే­శ్‌­కు స్వా­గ­తం పలి­కా­రు. అధు­నా­తన బో­ధ­నా పద్ధ­తు­లు, టీ­చ­ర్ ట్రై­నిం­గ్, రె­న్యూ­వ­బు­ల్ ఎన­ర్జీ­పై సీ­ని­య­ర్ ఎగ్జి­క్యూ­టి­వ్స్, పరి­శో­ధ­కు­ల­తో మం­త్రి చర్చిం­చా­రు.

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో­ని వి­శ్వ­వి­ద్యా­ల­యా­ల­తో కలి­సి జా­యిం­ట్ డి­గ్రీ ప్రో­గ్రా­మ్‌­లు, స్టూ­డెం­ట్ ఎక్స్చేం­జి పథ­కా­ల­ను ప్రా­రం­భిం­చా­ల­ని కో­రా­రు. ము­ఖ్యం­గా కృ­త్రిమ మేధ, రె­న్యూ­వ­బు­ల్ ఎన­ర్జీ రం­గా­ల­పై దృ­ష్టి సా­రిం­చి, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ యు­వ­త­కు అధు­నా­తన టె­క్నా­ల­జీ­ల్లో శి­క్షణ ఇచ్చే నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­ను ప్రా­రం­భిం­చా­ల­న్నా­రు. ఏపీ­లో పర్యా­వ­రణ సవా­ళ్ల­ను ఎదు­ర్కొ­నేం­దు­కు స్థి­ర­మైన వ్య­వ­సా­యం, నీటి ని­ర్వ­హణ అం­శా­ల్లో ఏపీ వర్సి­టీ­ల­తో కలి­సి సం­యు­క్త పరి­శో­ధ­న­లు చే­ప­ట్టా­ల­ని సూ­చిం­చా­రు. ఏపీ­లో­ని కృ­ష్ణ­ప­ట్నం, వి­శా­ఖ­ప­ట్నం, అనం­త­పు­రం వంటి పా­రి­శ్రా­మిక క్ల­స్ట­ర్‌­ల­లో ఆస్ట్రే­లి­యా కం­పె­నీ­లు భా­గ­స్వా­మ్యం వహిం­చే­లా సహ­కా­రం అం­దిం­చా­ల్సిం­ది­గా కో­రా­రు. 2025లో వి­శా­ఖలో ఏపీ ప్ర­భు­త్వం ని­ర్వ­హిం­చ­బో­తు­న్న భా­గ­స్వా­మ్య సద­స్సు­కు హా­జ­రు­కా­వా­ల్సిం­ది­గా ఆం­డ్రూ గై­ల్స్‌­ను లో­కే­శ్‌ ఆహ్వా­నిం­చా­రు. టీ­ఏ­ఎ­ఫ్ఈ ఎన్ఎ­స్‌­డ­‌­బ్ల్యూ క్యాం­ప­స్‌­కు చే­రు­కు­న్న మం­త్రి లో­కే­శ్‌­కు మే­నే­జిం­గ్ డై­రె­క్ట­ర్ క్లో రీడ్, ఇతర ఉన్న­తా­ధి­కా­రు­లు ఘన స్వా­గ­తం పలి­కా­రు. ఆస్ట్రే­లి­యా­లో నై­పు­ణ్యా­భి­వృ­ద్ధి, పరి­శ్రమ-అక­డ­మి­క్ భా­గ­స్వా­మ్యం­లో టీ­ఏ­ఎ­ఫ్ఈ ఎన్ఎ­స్‌­డ­‌­బ్ల్యూ కీలక పా­త్ర పో­షి­స్తోం­ద­ని, ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా అనేక సం­స్థ­ల­తో కలి­సి పని­చే­స్తోం­ద­ని ఆస్ట్రే­లి­యా మం­త్రి గై­ల్స్ వి­వ­రిం­చా­రు.

Tags:    

Similar News