మంత్రి నారా లోకేష్ తన కుమారుడు దేవాన్ష్ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ కోసం సెలవు తీసుకున్నారు. సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరై ప్రత్యేక క్షణాలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. 'ఈ రోజు దేవాన్ష్ స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కోసం సెలవు తీసుకున్నా. ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. మేం నిన్ను చూసి గర్విస్తున్నాము దేవన్ష్! ' అంటూ రాసుకొచ్చారు. దేవాంశ్ నవ్వు, చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్నిస్తాయని తెలిపారు. కుమారుడిని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. ఎప్పుడు పని ఒత్తిడిలో ఉండే నారా లోకేశ్.. కాస్త సమయం తీసుకుని కుమారుడి స్కూల్లో కార్యక్రమానికి హాజరుకావడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. లోకేశ్ ఎంత మంత్రైనా ఓ సాధారణ తండ్రే అని కామెంట్స్ చేస్తున్నారు.