2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అప్పుడే వారికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.నిజం తనవైపే ఉందని.. ఎన్నిసార్లయినా వస్తానన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్... విశాఖ కోర్టుకు వచ్చిన నారా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వార్తలు పదేపదే రాసి అది నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమన్నారు. ఐదు సంవత్సరాలుగా న్యాయపోరాటం చేస్తున్నట్లు వివరించారు.
మంత్రి హోదాలో తాను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం తిన్నానని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదని... వచ్చిన వాహనం కూడా తనదేనన్నారు లోకేశ్... సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నానని. ఎక్కడా ప్రభుత్వంపై ఆధారపడకూడదని తన తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని లోకేశ్ తెలిపారు.