LOKESH: "లెక్కల మాస్టారూ.. మీరు సూపర్"
ఆటపాటలతో గణితం నేర్పుతున్న మాస్టార్... లోకేశ్ ప్రశంసల జల్లు
కొంతమంది చిన్నారులకు కొన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులే వస్తున్నా గణితమంటే తెలియని భయం ఉంటుంది. అమ్మో లెక్కలా అని తెగ భయపడుతూ అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. గణితంపై పిల్లల్లో భయాన్ని పోగొట్టేందుకు ఓ ఉపాధ్యాయుడు చేస్తోన్న కృషిని మంత్రి నారా లోకేశ్) అభినందించారు. ‘బాగా చేస్తున్నారు.. ఇలాగే చేస్తుండండి’ అని ప్రోత్సహిస్తూ ‘ఎక్స్’లో వీడియోను పోస్టు పెట్టారు.‘‘లెక్కలంటే చాలా మందికి భయం.. విద్యార్థులను ఆటపాటల్లో మమేకం చేస్తూ స్నేహపూర్వక విద్యాబోధన ద్వారా లెక్కల సబ్జెక్ట్ అంటే లెక్క లేకుండా చేసేలా భయం పోగొట్టిన ఆళ్ళగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ టీజీటీ మ్యాథ్స్ టీచర్ తూపల్లె వెంకట చంద్ర Good work, keep it up. బోర్డుపైనే కాకుండా గ్రౌండులోనూ గణితం చెబుతున్న మీ ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.
గంజాయి రహిత రాష్ట్రంగా ఏపీ
ఏపీలో ఈగల్ వ్యవస్థను స్థాపించాక ఏడాదిన్నరలో జీరో గంజాయిగా మార్చామని హోంమంత్రి అనిత తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గతంలో గంజాయికి బానిసగా మారిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వివరించారు. ‘‘డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు, కేసుల్లో ఇరుక్కుంటే వచ్చే నష్టాలేంటో అవగాహన కల్పిస్తున్నాం. యువత భవిష్యత్తుపై మాట్లాడే హక్కు జగన్కు లేదు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు ఆయన ఒత్తాసు పలుకుతున్నారా? మాదకద్రవ కేసులో అడ్డంగా దొరికిన కొండారెడ్డి నేతృత్వంలో జగన్ శిక్షణ కార్యక్రమాలా? అని నిలదీశారు.