LOKESH: ప్రభుత్వ బడుల ముందు "నో అడ్మిషన్స్‌" బోర్డే లక్ష్యం

శాసనసభలో విద్యా మంత్రి నారా లోకేశ్ ప్రకటన.. మన బడి-మన భవిష్యత్తుతో పాఠశాలల అభివృద్ధి... 'ప్రతి తరగతికి ఒక టీచర్' విధానం అమలుకు జీఓ

Update: 2025-09-23 02:30 GMT

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రం­లో­ని ప్ర­తి ప్ర­భు­త్వ పా­ఠ­శాల ముం­దు 'నో అడ్మి­ష­న్స్' బో­ర్డు­ను చూ­డ­ట­మే తన లక్ష్య­మ­ని రా­ష్ట్ర వి­ద్యా, ఐటీ శాఖల మం­త్రి నారా లో­కే­శ్ స్ప­ష్టం చే­శా­రు. ఇప్ప­టి­కే ఈ ఏడా­ది 100 పా­ఠ­శా­ల­ల్లో ఈ పరి­స్థి­తి­ని సా­ధిం­చా­మ­ని, త్వ­ర­లో­నే రా­ష్ట్రం­లో­ని 42 వేల ప్ర­భు­త్వ బడు­ల­ను అదే స్థా­యి­కి తీ­సు­కె­ళ్తా­మ­ని ఆయన ధీమా వ్య­క్తం చే­శా­రు. శా­స­న­స­భ­లో నర్స­రా­వు­పేట ఎమ్మె­ల్యే చద­ల­వాడ అర­విం­ద­బా­బు అడి­గిన ప్ర­శ్న­కు మం­త్రి సమా­ధా­న­మి­చ్చా­రు. మన బడి-మన భవి­ష్య­త్తు’ కా­ర్య­క్ర­మం కింద వి­ద్యా­ర్థుల సం­ఖ్య ఆధా­రం­గా ఉపా­ధ్యా­యుల ని­యా­మ­కం, గదుల ని­ర్మా­ణం చే­ప­డు­తు­న్నా­మ­ని లో­కే­శ్‌ తె­లి­పా­రు. ‘‘యు­వ­గ­ళం పా­ద­యా­త్ర సం­ద­ర్భం­గా ఉపా­ధ్యా­యు­లు పలు సమ­స్య­ల­ను నా దృ­ష్టి­కి తీ­సు­కొ­చ్చా­రు. ఒక తర­గ­తి­కి ఒక ఉపా­ధ్యా­యు­డు ఉం­డా­ల­నే­ది మా లక్ష్యం. పా­ఠ­శాల భవ­నాల ని­ర్మా­ణం కోసం దాతల సహ­కా­రం కో­రు­తు­న్నాం. భవ­నా­ల­పై దాతల పే­ర్లు ఉం­డే­లా చూ­స్తాం. ప్ర­భు­త్వ పా­ఠ­శా­ల­ల్లో మంచి ఫలి­తా­లు రా­వా­ల­నే­ది మా ఉద్దే­శం. అన్ని ప్ర­భు­త్వ బడు­ల్లో సీ­ట్లు నిం­డి ‘నో అడ్మి­ష­న్’ బో­ర్డు­లు పె­ట్టా­ల­నే­దే నా లక్ష్యం. ప్ర­స్తు­తం రా­ష్ట్రం­లో సు­మా­రు వంద బడు­ల్లో అలాం­టి పరి­స్థి­తి ఉంది’’ అని మం­త్రి లో­కే­శ్‌ తె­లి­పా­రు. గత ప్ర­భు­త్వం తీ­సు­కొ­చ్చిన జీఓ నెం.117, 85లను ఈ ఏడా­ది మే 13న రద్దు చే­సి­న­ట్లు లో­కే­శ్ తె­లి­పా­రు. ఈ జీ­వో­లు ప్రా­థ­మిక వి­ద్యా­వ్య­వ­స్థ­కు గొ­డ్డ­లి­పె­ట్టు­గా మా­రా­య­ని, దీ­ని­వ­ల్ల సు­మా­రు 10 లక్షల మంది పేద వి­ద్యా­ర్థు­లు ప్ర­భు­త్వ బడు­ల­కు దూ­ర­మ­య్యా­ర­ని ఆయన అన్నా­రు. ప్ర­జా­ప్ర­భు­త్వం ఏర్ప­డిన వెం­ట­నే ఉన్న­తా­ధి­కా­రు­ల­తో 33 సమా­వే­శా­లు ని­ర్వ­హిం­చి, ఆ జీ­వో­ల­ను రద్దు చేసి, వాటి స్థా­నం­లో కొ­త్త జీ­వో­లు 19, 20, 21 తీ­సు­కొ­చ్చా­మ­ని వి­వ­రిం­చా­రు.

ప్రతి తరగతి గదికి ఓ టీచర్

'ప్ర­తి తర­గ­తి­కి ఒక టీ­చ­ర్' ఉం­డే­లా చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­ని మం­త్రి తె­లి­పా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం రా­క­ముం­దు కే­వ­లం 1398 పా­ఠ­శా­ల­ల్లో ఈ వి­ధా­నం అమ­ల్లో ఉం­డ­గా, ఇప్పు­డు ఆ సం­ఖ్య­ను 9620కి పెం­చా­మ­ని చె­ప్పా­రు. అదే­వి­ధం­గా, గతం­లో 124గా ఉన్న అప్ప­ర్ ప్రై­మ­రీ స్కూ­ళ్ల­ను 729కి అప్‌­గ్రే­డ్ చే­సి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. పా­ఠ­శా­ల­ల్లో మౌ­లిక వస­తుల కల్పన కోసం 'మన బడి – మన భవి­ష్య­త్తు' కా­ర్య­క్ర­మా­న్ని ప్రా­రం­భిం­చా­మ­ని లో­కే­శ్ తె­లి­పా­రు. దాతల నుం­చి పా­ర­ద­ర్శ­కం­గా ని­ధు­లు సే­క­రిం­చి, పా­ఠ­శా­లల అభి­వృ­ద్ధి­కి చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని అన్నా­రు. బడు­ల­కు ఇప్ప­టి­కే స్టా­ర్ రే­టిం­గ్ వి­ధా­నం ప్ర­వే­శ­పె­ట్టా­మ­ని, వా­టి­ని మె­రు­గు­ప­రి­చే బా­ధ్యత స్థా­నిక శా­స­న­స­భ్యు­ల­పై ఉం­ద­ని సూ­చిం­చా­రు. దీం­తో పాటు, ని­వా­సా­ని­కి కి­లో­మీ­ట­రు కంటే ఎక్కువ దూ­రం­లో పా­ఠ­శాల ఉన్న వి­ద్యా­ర్థు­ల­కు రవా­ణా ఖర్చుల కింద నె­ల­కు రూ.600 చొ­ప్పున పది నెలల పాటు అం­ది­స్తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. ఈ ఏడా­ది సు­మా­రు 70 వేల మంది వి­ద్యా­ర్థు­ల­కు ఈ ప్ర­యో­జ­నం అం­దు­తుం­ద­ని తె­లి­పా­రు. రా­బో­యే రో­జు­ల్లో ప్రై­వే­టు పా­ఠ­శా­ల­ల­ను మిం­చి ప్ర­భు­త్వ బడు­ల­ను తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని మం­త్రి హామీ ఇచ్చా­రు.

Tags:    

Similar News