Lokesh : విశాఖలో పచ్చని రుషికొండను బోడికొండగా మార్చారు : నారా లోకేష్
Lokesh : సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు;
Lokesh : సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేని హడావిడి నిర్ణయంతో.. ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ సంక్షోభంలో పడిందంటూ లోకేష్ లేఖ రాశారు. మీ నిర్ణయంతో రాష్ట్రంలో 7లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ వివరించారు. ఉన్నట్టుండి మీరు పర్యావరణంపై ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగా ఉందని జగన్‌కు రాసిన లేఖలో లోకేష్ తెలిపారు.
పర్యావరణంపై అంతప్రేమ ఉంటే ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ.. పర్యావరణాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాదు.. విశాఖలో పచ్చని రుషికొండను బోడికొండగా మార్చారంటూ గుర్తుచేశారు.