Nara Lokesh : లోకేష్ చతురత.. ఏపీకి మరో భారీ పెట్టుబడి..

Update: 2025-11-03 16:11 GMT

మంత్రి నారా లోకేష్ ఏపీ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన పనితనం ఏ స్థాయిలో ఉందంటే.. గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చేంత. ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద పెట్టుబడి గూగుల్ విశాఖలో పెడుతోందంటే దీని వెనకాల లోకేష్ సమర్థత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు చాలా రకాల కంపెనీలను విశాఖకు, రాయలసీమకు తీసుకువస్తున్నారు లోకేష్. ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఎవ్రెన్ సంస్థ భారీ స్థాయిలో ఈ జిల్లాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఏకంగా రూ.50వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి లోకేష్ ఈ సంస్థను ఒప్పించాడు.

భారత్ లో ఎవ్రెన్ సంస్థ 11 గిగావాట్ల నిర్మాణం చేపడుతోంది. అయితే ఈ సంస్థ ఏపీని ప్రత్యేకంగా ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఇక్కడే లోకేష్ చతురత చూపించాడు. ఆ సంస్థ సీఈవోతో మాట్లాడి ఏపీలో ఉన్న అడ్డంకులను క్లియర్ చేస్తామని ఒప్పించాడు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రాయితీల గురించి వివరించాడు. దీంతో ఏపీలో 9 ప్రాజెక్టులు నిర్మించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. భారీ విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా 3 గిగావాట్లను నిర్మించేందుకు ఒప్పుకుంది. రూ.9910 కోట్లతో మొదటి దశలో ప్లాంట్ నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విద్యుత్ పునరుత్పాదక సంస్థకు రూ.7500 కోట్లను ఆర్ ఈసీ రుణం అందించనుంది.

ఈ సంస్థ ఏపీకి రావడంలో లోకేష్ కృషిని మెచ్చుకోవాల్సిందే. ఆయన వల్లే ఈ సంస్థ ఏపీకి వస్తోంది. లోకేష్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇండియాకు రావాలనుకున్న ప్రతి కంపెనీ దగ్గరకు వెళ్లి మా ఏపీకి రండి అని వారికి ఇక్కడున్న అవకాశాలను వివరిస్తూ ఒప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో ఒక్క కంపెనీ రాకపోవడంతో అభివృద్ధి చాలా వెనకబడింది. కానీ సీఎం చంద్రబాబుకు తోడుగా లోకేష్ చాలా కంపెనీలను ఏపికి తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఒకే జిల్లాకు పెట్టుబడులను పరిమితం చేయకుండా.. అన్ని ప్రాంతాలకు పెట్టుబడులను సమానంగా తీసుకొస్తున్నారు.


Full View

Tags:    

Similar News