లోకేష్‌ ఘనత.. ఆక్వా దిగుమతికి ఆస్ట్రేలియానే ఒప్పించాడుగా..

Update: 2025-10-23 13:15 GMT

ఆక్వా రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో 8 ఏళ్ల తర్వాత రొయ్యల ఎగుమతికి ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనంతటికీ కారణం లోకేష్ పట్టువదలని కృషి అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆక్వా ఎగుమతిపై భారీగా సుంకాలు విధించడంతో దారుణమైన దెబ్బ పడింది. దీంతో రొయ్యల ఎగుమతి తగ్గి ఆక్వా రైతులు తీవ్రంగా నష్టాలు పాలు అయ్యారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. చివరకు కేంద్ర ప్రభుత్వంకు విషయాన్ని వివరించి జోక్యం చేసుకోవాలని కోరింది.

ఆ నేపథ్యంలోనే నారా లోకేష్ ఆస్ట్రేలియాలకు వెళ్లారు. అక్కడ వరుసగా కంపెనీల సీఈవోలతో మాట్లాడి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక తాజాగా ఆక్వా రైతుల కోసం లోకేష్‌ అక్కడ చక్రం తిప్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల సమన్వయంతో ఆక్వాను ఎగుమతి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఒప్పించారు. దీంతో 8 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు ఏపీ నుంచి రొయ్యలు ఎగుమతి కాబోతున్నాయి. అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా మారింది. దేశంలోనే ఏపీ ఆక్వా రంగంలో టాప్ లో ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే.

ఏపీలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ కావడంతో ఆక్వా రైతులు సంతోషంలో ఉన్నారు. ఎనిమిదేళ్లుగా ఆగిపోయిన ఎగుమతులను మళ్లీ స్టార్ట్ అయ్యేలా ఒప్పించడం అంటే ఎంత సమర్థత ఉండాలి అని ఆక్వా రైతులు లోకేష్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విశాఖలో జరగబోయే సమ్మిట్ కు సదరు కంపెనీ ప్రతినిధులు రాబోతున్నారు. వారు ఏపీలో రొయ్య ఎంత క్వాలిటీగా ఉందనేది కూడా తెలుసుకుంటారు. లోకేష్‌ ఇచ్చిన హామీలతోనే వారు దిగుమతి చేసుకునేందుకు ఒప్పుకున్నారు. కేవలం పెట్టుబడుల వేటలోనే కాదు.. ఏపీలో ఏ వర్గానికి కష్టం వచ్చినా లోకేష్‌ చేస్తున్న ప్రయత్నాలు అందరనీ వావ్ అనిపిస్తున్నాయి.


Full View

Tags:    

Similar News