మదనపల్లె సబ్‌జైలులో వింత చేష్టలు చేస్తున్న పురుషోత్తం, పద్మజ
జైలు అధికారులు పురుషోత్తం, పద్మజను విశాఖ తరలించారు.;
మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు పురుషోత్తం, పద్మజను విశాఖ తరలించారు. ఇప్పటి వరకు మదనపల్లె సబ్‌జైలులో ఉన్న వీరిద్దరినీ.. ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. పద్మజ, పురుషోత్తం మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వీరిద్దరినీ పరీక్షించిన వైద్యులు.. పురుషోత్తం, పద్మజకు కస్టోడియన్ కేర్ కావాలని సూచించారు. దీంతో జైలు అధికారులు నిందితులను విశాఖ తరలించారు.