తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ జరడంపై బీజేపీ నేత మాధవీలత శ్రీవారిని క్షమాపణ కోరనున్నారు. ఇందుకు గాను ఆమె ఉదయం సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్‌లో తిరుపతి బయలుదేరి వెళ్ళారు. కాలి నడకన ఏడు కొండలు ఎక్కి స్వామి వారి హుండీలో క్షమాపణ లేఖ వేయనున్నట్టు తెలిపారు మాధవీలత.
తిరుమల వెంకన్న ఆలయం ప్రతిష్ట దెబ్బతిన్నదంటూ హిందువులు అందరూ ఈ విషయాన్ని ఖండించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో నేతలు స్పందిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ ఆరోపణలు తప్పుపడుతున్న వైసీపీ 28న ఆలయాల్లో పూజలకు ఏర్పాట్లు చేస్తోంది. 28న తిరుమలకు జగన్ వస్తానని చెప్పడం సంచలనం రేపుతోంది.