ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ సభలో హోంమంత్రి అనితపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేబినెట్ లాంటి సమావేశాల్లో ఆయన సూచలు ఇచ్చుకోవచ్చని సూచించారు.మాదిగ మహిళను దారుణంగా అవమానించినట్లేననీ.. మా చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా పవన్ విమర్శించినట్టేనని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటే చంద్రబాబును అన్నట్టు కాదా అని ప్రశ్నించారు. కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చుగానీ మాదిగలైన తమకు కాదన్నారు. పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టమన్నారు. ఎన్నికలప్పుడు, ఎన్నికల తర్వాత, కేబినెట్ కూర్పులోనూ.. జనసేన పార్టీ చీఫ్ గా పవన్ మాదిగలకు అన్యాయం చేశారని విమర్శించారు మందకృష్ణ.