విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి అప్పలరాజు రుబాబు.. చొక్కా విప్పి కొడతానంటూ
Minister Appalaraju : విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి సిదిరి అప్పలరాజు పోలీసులపై రుబాబుకు దిగారు. ఏకంగా చొక్కా విప్పి కొడతానంటూ ఓ సీఐకి వార్నింగ్ ఇచ్చారు.;
Minister Appalaraju : విశాఖ శారదాపీఠం దగ్గర మంత్రి సిదిరి అప్పలరాజు పోలీసులపై రుబాబుకు దిగారు. ఏకంగా చొక్కా విప్పి కొడతానంటూ ఓ సీఐకి వార్నింగ్ ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రే పోలీసులపై పరుష పదజాలంతో దూషించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న తమపై మంత్రి దౌర్జన్యం దిగడమేంటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం పర్యటన సందర్భంగా.. విశాఖ శారదా పీఠంలోకి వెళ్తుంటే.. మంత్రి సిదిరి అప్పలరాజును ఓ సీఐ అడ్డుకున్నారు. వెళ్తే మంత్రి ఒక్కరే లోపలికి వెళ్లాలని.. అనుచరులను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో మంత్రి ఆవేశంతో ఊగిపోయారు. లోపలికి వెళ్తే అనుచరులతో కలిసే వెళ్తానని భీష్మించారు. ఐతే.. మంత్రి మాట వినకపోవడంతో సదరు సీఐ గేట్ వేసేశారు. మంత్రితో పాటు ఆయనతో పాటు ఉన్న అనుచరులు కూడా పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరకు సహనం కోల్పోయిన మంత్రి.. ఎలా కన్పిస్తున్నాను నీకు.. చొక్కా విప్పి కొడతానంటూ సీఐని బెదిరించారు.
తనతో దురుసుగా ప్రవర్తించిన సీఐతో క్షమాపణలు చెప్పించాల్సిందేనంటూ మంత్రి పోలీస్ ఉన్నతాధికారుల ముందు పట్టుబట్టారు. సాక్షాత్తు సీఎం శారదాపీఠంలో ఉండగానే.. గేటు బయట ఈ తతంగమంతా జరిగింది.