ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారి దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా వచ్చి తలనీలాలు సమర్పించాను. స్వామి వారి ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ సపోర్ట్ తో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి వైపు అడుగులేస్తుంది. రాయలసీమలో నీరు పాలించాలని సీఎం కృషి చేస్తున్నారు. పోలవరం - మడకచర్ల ప్రాజెక్టు పూర్తి కావడానికి స్వామి వారి ఆశీస్సులు కావాలని కోరుకున్నాను.. రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. శ్రీవారి ఆశీస్సులతో పూర్తి కావాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు.