మిషన్ రాయలసీమ.. లోకేష్
ఈనెల 11వ తేదీతో ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కానుండటంతో ఇవాళ మిషన్ రాయలసీమ పేరుతో ఈ ప్రాంత అభివృద్ధిపై డిక్లరేషన్‌ను కడపలో ప్రకటించనున్నారు లోకేష్;
రాయలసీమ డిక్లరేషన్‌పై ఇవాళ కీలక ప్రకటన చేయనున్నారు లోకేష్. ఈనెల 11వ తేదీతో ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి కానుండటంతో ఇవాళ మిషన్ రాయలసీమ పేరుతో ఈ ప్రాంత అభివృద్ధిపై డిక్లరేషన్‌ను కడపలో ప్రకటించనున్నారు లోకేష్. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందనేది ఈ డిక్లరేషన్ ద్వారా వివరిస్తారు. గత 119 రోజులుగా... పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలు , వాటి పరిష్కారానికి రూపొందించిన భవిష్యత్ కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తారు.
రాయలసీమ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రకటనలో రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దడానికి చేపట్టే కార్యక్రమాలను వివరిస్తారు. ఇక యువత ఉపాధికి పరిశ్రమలు, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఇంటింటికి తాగునీటి సదుపాయం, వలసల నివారణ ప్రణాళికను విడుదల చేయనున్నారు. భవిష్యత్ ఫలితాలను విశదీకరించనున్నారు. ఇందుకోసం ఇవాళ పాదయాత్రకు విరామం ఇచ్చారు లోకేష్.