MLA Balakrishna : ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకోం.. పద్దతి మార్చుకోకపోతే మెడలు వంచి మారుస్తాం..!
MLA Balakrishna : ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకుని ఉండబోమని హెచ్చరించారు నందమూరి బాలకృష్ణ.;
MLA Balakrishna : ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకుని ఉండబోమని హెచ్చరించారు నందమూరి బాలకృష్ణ. తమ సోదరిపై వ్యక్తిగత విమర్శలను సహించంబోమని తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. పద్దతి మార్చుకోకపోతే మెడలు వంచి మారుస్తాం అంటూ తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ. సభలో వైసీపీ ఎమ్మెల్యేల భాష చూస్తుంటే.. అసెంబ్లీలో ఉన్నామో.. పశువుల కొట్టంలో ఉన్నామో అర్ధం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదన్నారు బాలకృష్ణ. ఎంతో దైర్యంగా ఉండే చంద్రబాబు ఎప్పుడూ కంటతడి పెట్టుకోలేదని, కుటుంబ సభ్యుల పైన ఈ విధమైన దాడి సరికాదన్నారు. అసెంబ్లీ హుందాతనాన్ని కాపాడాలని అన్నారు.