TTD : టీటీడీ ఉద్యోగితో గొడవ పడిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే..?

Update: 2025-07-25 08:45 GMT

తిరుమల శ్రీవారి ఆలయంలో వివాదం చెలరేగింది. గేటు విషయంలో ఓ ఉద్యోగితో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే. వీఐపీ దర్శనం తరువాత బయటికి వస్తుండగా గేటు తియ్యాలని సదరు ఎమ్మెల్యే అడగగా.. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గేటు తీసేది లేదని అక్కడున్న ఉద్యోగి ఆన్సర్ ఇచ్చాడు. అయితే గేటు తియ్యక పోవడంతో ఉద్యోగితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగాడు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది నచ్చ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే రామ‌కృష్ణ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత బయటకు వస్తుండగా మహాద్వారం ఎదురుగా ఉన్న గేటు తియ్యాలని అక్కడ ఉన్న ఉద్యోగిని అడిగారు. అయితే అధికారుల ఆదేశాల ప్రకారం ఈ గేటు నుండి ఎవరిని అనుమతించేది లేదని.. అందరూ వెళ్ళే మార్గంలోనే వెళ్లాలని చెప్పడం తో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురై వాగ్వాదానికి దిగారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది కలగజేసుకొని గేటు తీయడంతో బయటకు వెళ్ళిపోయారు ఎమ్మెల్యే. తన పట్ల ఉద్యోగి అమర్యాదగా ప్రవర్తించిన విష‌యాన్ని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు.

Tags:    

Similar News