Tirupati MLA : పవన్ సినిమా హిట్టు అవ్వాలని ఎమ్మెల్యే పూజలు...100 కొబ్బరికాయలతో..
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ఆయన అభిమానులే కాదు పలువురు రాజకీయ నాయకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మేరకు సినిమా విడుదల కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో... తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ సినిమా విజయవంతం కావాలని శ్రీవారి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు అలిపిరి మెట్ల వద్ద 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. ఎమ్మెల్యే తో పాటు జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా పూజల్లో పాల్గొన్నారు. ఈ సినిమా లో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.