AP: ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి...సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా పొదలకూరులో ఉచిత బస్సులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ స్త్రీ శక్తి పథకం రూపొందించి అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చిత్రపటాలకు ఈ సందర్భంగా మహిళలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు 162 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ఏడాదికి 1942కోట్లకు ఖర్చవుతుందన్నారు. స్త్రీ శక్తి పథకం సాధారణ మహిళల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మహిళలకు చేయూతనందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయ ని అన్నారు. తల్లికి వందనం, దీపం -2, స్త్రీ శక్తి పథకాల ద్వారా మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.