టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్ట్ !
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా పలువురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.;
టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఛలో పులివెందుల కార్యక్రమం సందర్భంగా పలువురిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవిని అరెస్ట్ చేయడంపై నిరసనకు దిగారు టీడీపీ నేతలు. లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ నాగమ్మ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. దీనిపై తమకు పరువునష్టం జరిగింది అంటూ నాగమ్మ సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 21 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన పోలీసులు.. ఈ కేసులో భాగంగా ఎంల్‌ఎసీ బీటెక్ రవిని చెన్నై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.