కాజీపేటలో వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.. కాజీపేటలో వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ అప్‌గ్రేడ్ చేస్తూ నిర్ణయించింది. వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌గా మార్చుతున్నట్లు ప్రకటించింది.. గత కొద్దిరోజులుగా స్థానిక రాజకీయ నాయకుల డిమాండ్ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌లో నెలకు 200 వ్యాగన్స్‌కు రిపేర్ చేసే కెపాసిటీ ఉండగా.. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, ఆర్థికపరమైన ఎదుగుదలకు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. భారతీయ రైల్వేకి వ్యాగన్ల వినియోగం పెరుగుతున్నందున మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అవసరమని నిర్ణయించారు.. గతంలో ఉన్న యూనిట్‌లోనే మ్యానుఫాక్చరింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది.. మొదటి ఏడాదికి 1200 వ్యాగన్లు తయారు చేసే సామర్థ్యం ఉండగా, రెండో ఏడాది నెకు 200, ఏడాదికి 2,400 వ్యాగన్ల తయారు చేయవచ్చని రైల్వే అధికారులు చెప్తున్నారు.