ఏపీలో విద్యుత్ కోతలు పెరిగాయి : రఘురామకృష్ణరాజు
ఏపీ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.;
ఏపీ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు.. ఆక్వా రైతులకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఆక్వా రైతులకు విద్యుత్ లేకపోవడంతో వారు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన నియోజకవర్గం నర్సాపురంలో ఆక్వాపై ఆధారపడి ఎంతో మంది రైతులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రొయ్య బతికితేనే ఆక్వా రైతు బతుకుతాడని.. డీజిల్ జనరైటర్‌తో నడిపితే ఖర్చులు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పవర్ కట్ మూడు నుంచి నాలుగు గంటలు చేస్తున్నారన్న రఘురామ.. రైతులకు భరోసా కేంద్రాలు కట్టింది తక్కువ.. చెప్పేది ఎక్కువ అన్నట్లు ఉందన్నారు. మరోవైపు ప్రభుత్వానికి మందు.. ముందు చూపు లేదని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.